
ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) /ఢాకా: బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు సంబంధించి ఆ దేశ మీడియాలో వస్తున్న కథనాలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. షరీఫ్‌ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు భారత్‌లోని మేఘాలయలోకి చొరబడ్డారన్న వార్తల్లో నిజం లేదని బీఎస్‌ఎఫ్, మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (మేఘాలయ) ఓపీ ఉపాధ్యాయ తెలిపారు. ‘‘మేఘాలయలోని హలువాఘాట్ దగ్గర అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ఏ వ్యక్తీ ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. అలాంటి ఘటనను బీఎస్‌ఎఫ్ గుర్తించలేదు. అందుకు సంబంధించి ఎలాంటి నివేదికా మాకు అందలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న కథనాలు అబద్ధమని స్పష్టంచేశారు. మేఘాలయ పోలీసు అధికారి కూడా ఈ వార్తలను ఖండించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ