
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
ప్రపంచ ప్రఖ్యాత స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డ్ కు
ఊహించని షాక్ తగిలింది. గత కొద్ది రోజుల్లోనే ఆయన ట్విట్టర్లో కోటి మంది ఫాలోవర్లను కోల్పోయాడు. రొనాల్డో ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఏకంగా 10 మిలియన్ల (కోటి) మంది ఫాలోవర్లు తగ్గిపోవడం స్పష్టంగా కనిపించింది. నవంబర్లో 115 మిలియన్లుగా ఉన్న ఆయన ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 105 మిలియన్లకు తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం ఫేక్ అకౌంట్లు తొలగించడమే విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే నవంబర్ 18న అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ వ్యాప్తంగా వివాదస్పంగా మారుతున్న డొనాల్డ్ ట్రంప్ తో రొనాల్డో భేటీ కావడం కూడా తీవ్ర ప్రభావం చూపించినట్లు అంచనా వేస్తున్నారు. ట్రంప్ అంటే ఇష్టం లేని వారికి వారి మీటింగ్ కోపం తెప్పించిందని కూడా సమాచారం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికి రోనాల్డో రోజుల వ్యవధిలోనే కోటి మంది ఫాలోవర్లను కోల్పోవడం క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..