చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా
కోల్‌కతా/ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన విమర్శలతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం
Amit shah


కోల్‌కతా/ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన విమర్శలతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం అవినీతి, భయం, చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని అమిత్‌షా అన్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్లపై షా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, సరిహద్దుల వద్ద కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమిత్‌ షా పేర్కొన్నారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి, చొరబాటుదారులను బయటకు తరిమికొడుతుందని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande