చీనాబ్‌పై కొత్త ప్రాజెక్టుకు ఆమోదం
ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) పాకిస్థాన్‌కి గడ్డు కాలం మొదలు కానుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక కమిటీ జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చెనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–2 జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌తో
చీనాబ్‌పై కొత్త ప్రాజెక్టుకు ఆమోదం


ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.)

పాకిస్థాన్‌కి గడ్డు కాలం మొదలు కానుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక కమిటీ జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చెనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–2 జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌తో ఉన్న ఇండస్ జల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ) ప్రస్తుతం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇండస్ నది, దాని ఉపనదుల నీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్‌లో జరిగిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి తర్వాత, 1960లో కుదిరిన ఇండస్ జల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు కేటాయించిన ఇండస్ నది పశ్చిమ ఉపనదులైన చెనాబ్, జెలమ్, ఇండస్‌లపై భారత్ తన హక్కులను వినియోగించుకునేందుకు వేగంగా చర్యలు ప్రారంభించింది.

దీని లక్ష్యం జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం, నీటి భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవడం షురూ చేసింది. దుల్హస్తీ స్టేజ్–2 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడం, జులైలో ఇదే చెనాబ్ నదిపై 1,856 మెగావాట్ల సవాల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ టెండర్లు పిలిచిన కొన్ని నెలల జరిగింది. ఇండస్ జల ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు, పశ్చిమ నదులపై భారత్‌కు కేవలం నీటిని వినియోగించకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒప్పందం నిలిపివేయబడినప్పటికీ, కొత్తగా ఆమోదించిన ప్రాజెక్టులన్నీ ‘రన్-ఆఫ్-ది-రివర్’ విధానంలోనే ఉండటం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande