
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన
పొగమంచు కారణంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI)లో భారీగా విమాన సర్వీసులను రద్దు చేసారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ కొన్ని చోట్ల 50 నుంచి 100 మీటర్లకు పడిపోగా.. CAT-III హెచ్చరికలు జారీ చేసారు. దీనివల్ల సుమారు 118 విమానాలు రద్దు కాగా, 16 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. మరో 1303 పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసి ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు