తమిళనాడులో ద్వేషపూరిత వాతావరణం.. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆందోళన
తమిళనాడు, 30 డిసెంబర్ (హి.స.) తమిళనాడులోని ఒక ఎలక్ట్రిక్ రైల్లో ఒడిశాకు చెందిన వలస కార్మికుడిపై నలుగురు మైనర్లు కత్తితో దాడి చేసిన ఘటనపై సీపీఐ (CPI) ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పందించారు. తమిళనాడు రాష్ట్రం ఇలాంటి దాడులకు ఏ మాత్రం పేరుగాంచినది క
రాజా ఆందోళన


తమిళనాడు, 30 డిసెంబర్ (హి.స.)

తమిళనాడులోని ఒక ఎలక్ట్రిక్ రైల్లో

ఒడిశాకు చెందిన వలస కార్మికుడిపై నలుగురు మైనర్లు కత్తితో దాడి చేసిన ఘటనపై సీపీఐ (CPI) ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పందించారు. తమిళనాడు రాష్ట్రం ఇలాంటి దాడులకు ఏ మాత్రం పేరుగాంచినది కాదని, అక్కడ దశాబ్దాలుగా వలస కార్మికులు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, తాజాగా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో మారుతున్న సామాజిక వాతావరణానికి అద్దం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తమిళనాడులో అన్ని మతాల వారు, వివిధ ప్రాంతాల వారు శాంతియుతంగా కలిసి ఉండటం అక్కడి సంస్కృతి అని, కానీ ఇటీవల RSS, సంఘ్ పరివార్ సంస్థలు సృష్టించిన ద్వేషపూరిత వాతావరణం వల్లే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande