
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్పీ అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా మరణ వార్తపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. బేగం ఖలీదా జియా మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, బంగ్లాదేశ్ ప్రజలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆ దేశ అభివృద్ధికి, అలాగే భారత్-బంగ్లాదేశ్ సంబంధాల బలోపేతానికి ఆమె చేసిన విశేష కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మోడీ కొనియాడారు. 2015లో ఢాకా పర్యటనలో ఆమెతో జరిగిన భేటీని గుర్తు చేసుకున్న ప్రధాని, ఆమె ఆశయాలు, వారసత్వం ఇరు దేశాల భాగస్వామ్యానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయని ప్రధాని మోడీ తన ట్వీట్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు