
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం
ఉదయం ట్రేడింగ్లో నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలకు తోడు, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా షేర్లను విక్రయిస్తుండటంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 209.32 పాయింట్లు క్షీణించి 84,486.22 వద్ద ట్రేడవుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 63.25 పాయింట్ల నష్టంతో 25,878.85 వద్ద కొనసాగుతోంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు