క్షీణించిన పరిస్థితులు.. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ రాయబారి వాపస్
ఢిల్లీ, 30 డిసెంబర్ (హి.స.) భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులునెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్‌గా పనిచేస్తున్న రియాజ్ హమీదుల్లాను బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యవసరంగా వెనక్కి రావాలని పిలుపుని
bangladeshs-ambassador-in-delhi-urgently-arrives-in-dhaka-508981


ఢిల్లీ, 30 డిసెంబర్ (హి.స.)

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులునెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్‌గా పనిచేస్తున్న రియాజ్ హమీదుల్లాను బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యవసరంగా వెనక్కి రావాలని పిలుపునిచ్చింది. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అందిన ఆదేశాల మేరకు ఆయన సోమవారం రాత్రికి రాత్రే ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ లోని కీలక వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకే ఆయన్ని పిలిపించి నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి ప్రముఖ దిన పత్రికలో' ప్రచురించారు. సరిహద్దు సమస్యలు, ఇటీవల తలెత్తిన దౌత్యపరమైన వివాదాల నేపథ్యంలో, తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande