దిల్లీ గగనతలంపై ‘సుదర్శన చక్రం’.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌..
ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీలోని కీలక వీఐపీ-89 జోన్‌లో గగనతల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ సమీకృత ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టమ్స్‌ (IADWS) కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్ల
దిల్లీ గగనతలంపై ‘సుదర్శన చక్రం’.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌..


ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీలోని కీలక వీఐపీ-89 జోన్‌లో గగనతల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ సమీకృత ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టమ్స్‌ (IADWS) కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ‘సుదర్శన చక్ర (Sudarshan Chakra For Delhi)’ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ కథనం పేర్కొంది.

ఈ గగనతల రక్షణ వ్యవస్థ విలువ దాదాపు రూ.5,181 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని డీఆర్‌డీవో (DRDO) అభివృద్ధి చేసింది. ఇది దేశ రాజధాని చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గగనతల ముప్పులనైనా అడ్డుకోగలదని సదరు వర్గాలు వెల్లడించాయి. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ పోరాట సామర్థ్యాలను మరింత పెంచేలా రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ సామగ్రి కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కొనుగోలుకు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande