కుప్పకూలిన బంగారం ధర.. వారం తర్వాత భారీ పతనం.. ఈరోజు తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే
ముంబై, 30 డిసెంబర్ (హి.స.) పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. వారం రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. రికార్డ్ గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి రేట్లు భారీగా పడి
gold


ముంబై, 30 డిసెంబర్ (హి.స.) పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. వారం రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. రికార్డ్ గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి రేట్లు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర ఈరోజు భారీగా పడిపోయింది. దాదాపు 200 డాలర్లు దిగొచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో డిసెంబర్ 30వ తేదీన రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అదిరే శుభవార్త. ఎందుకంటే బంగారం ధరలు కుప్పకూలాయి. రికార్డ్ గరిష్ఠాల నుంచి భారీగా పడిపోయాయి. భారత ప్రజలకు బంగారం అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ స్థోమతకు తగినట్లుగా బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు ఇలా ప్రత్యేక సందర్భాల్లో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే, బంగారం ధరలు ఈ 2025 ఏడాదిలో విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత వారం రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా రికార్డ్ స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ అనిశ్చితి, దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇలా ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. దీంతో ఆల్ టైమ్ హై స్థాయిని చేరుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande