ద్రాక్షారామంలో శివలింగాన్ని.ధ్వంసం.చేసిన.నిందితుడి అరెస్ట్
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.) ద్రాక్షారామ: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర
ద్రాక్షారామంలో శివలింగాన్ని.ధ్వంసం.చేసిన.నిందితుడి అరెస్ట్


అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)

ద్రాక్షారామ: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా వెల్లడించారు. డ్రైనేజీ వివాదం నేపథ్యంలో ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు.

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి నిందితుడు ధ్వంసం చేశాడు. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టు పక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని విశ్లేషించారు. ఈ క్రమంలో నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande