
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)
సీతంపేట, : రైల్వే, నేవీ, ఎన్ఎస్ఈఎల్లో ఉద్యోగాలు ఇప్పి స్తానని నమ్మించి సుమారు రూ.50 లక్షలు కాజేసిన వ్యక్తిపైన, అతనికి సహకరిం చిన మరో వ్యక్తిపైన నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు, బాధి తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపట్నంకు చెందిన కోట అరుణ కుమార్ ఎంఈఎస్‌లో పనిచేస్తున్న విజయ్ రాజుతో పరిచయం ఉంది. దీంతో విజయ్ రాజు పనిచేస్తున్న రైల్వేస్టేషన్ రోడ్డులో గల ఎంఈఎస్ ఆఫీస్ కి కోట అరుణ కుమార్ వస్తుండేవాడు. అక్కడ కూర్చొని కొంత మంది నిరుద్యోగులకు రైల్వేలో ట్రేడ్మెన్లు, గ్రూప్‌డి, కుకింగ్ విభాగాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ