
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)
అమరావతి, డిసెంబర్ 31: కొత్త సంవత్సరంలో ఏపీ మంత్రి మండలి సమావేశం ) తేదీ ఖరారైంది. జనవరి 8న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను జనవరి 6వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోపు సమర్పించాలని మెమో జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు అందజేయాలని అధికారులకు సూచించారు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో, శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ