
ములుగు, 31 డిసెంబర్ (హి.స.)
ములుగు జిల్లా పర్యాటక అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాం అని మంత్రి సీతక్క అన్నారు.
బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్, తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డి.ఎఫ్.ఓ. రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క అధికారులతో కలిసి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్ సుమారు 7 కిలోమీటర్ల మేర పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఎకో టూరిజం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ లోని తాడ్వాయి హాట్స్ను ఆధునీకరణంగా సుందరీకరించి ప్రకృతి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు