మూడు జిల్లాల అధికారులతో మంత్రి అడ్లూరి సమీక్ష
భూపాలపల్లి, 31 డిసెంబర్ (హి.స.) ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మూడు జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష సమావ
మంత్రి అడ్లూరి


భూపాలపల్లి, 31 డిసెంబర్ (హి.స.) ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మూడు జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు, వరంగల్ కలెక్టర్ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, పివో చిత్ర, అదనపు కలెక్టర్లు, ఎస్సి, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాల వారీగా ఎస్సి, ఎస్టీ గురుకులాలు, వసతి గృహల ప్రోగ్రెస్ ను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వసతి గృహాల్లో, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి వసతి గృహాల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బాలికల వసతి గృహాల్లో ప్రత్యేక సెక్యూరిటీని నియమించాలని సూచించారు. ప్రతి వారం విద్యార్థుల హెల్త్ చెకప్ చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande