
ఖమ్మం, 31 డిసెంబర్ (హి.స.)
అధికారం పోయినా కొందరు నాయకులకు అహంకారం ఇంకా తగ్గలేదని, విర్రవీగితే సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. తమది కక్ష పూరిత ప్రభుత్వం కాదని అన్నారు. బుధవారం ఖమ్మం వైరా రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పాలేరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత ప్రభుత్వం కేవలం మాటలతో, ఊహలతో కాలక్షేపం చేసిందని, అనేక అవినీతి మరకలంటించుకుందని దుయ్యబట్టారు. నాయకులు ప్రజలకు దూరం కావొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించాలని సూచించారు. 2026 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు