
గోదావరిఖని,31 డిసెంబర్ (హి.స.)
వైద్యులు సమయ పాలన పాటించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం గోదావరిఖని ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో వైద్యులు సమయ పాలన పాటిస్తూ విధులకు తప్పకుండా హాజరుకావాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ సర్జరీ బ్లాక్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదులు రాకుండా వైద్య సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు