ఇయర్ ఎండింగ్ డే ఫుల్ జోష్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) సంవత్సరం చివరి రోజు ట్రేడింగ్ సెషన్లో భారతీయ షేర్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. వరుస నష్టాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి బలమైన కొనుగోళ్లతో దేశీయ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 545.52 పాయింట్ల లాభంతో
స్టాక్ మార్కెట్


హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)

సంవత్సరం చివరి రోజు ట్రేడింగ్

సెషన్లో భారతీయ షేర్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. వరుస నష్టాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి బలమైన కొనుగోళ్లతో దేశీయ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 545.52 పాయింట్ల లాభంతో 85,220.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 190.75 పాయింట్ల లాభంతో 26,129.60 వద్ద స్థిరపడింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా దాదాపు 1 శాతం పైగా లాభపడ్డాయి.

ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి దిగుమతి స్టీల్ ఫ్లాట్ ప్రొడక్ట్స్ పై 12 శాతం సేఫ్ గార్డ్ డ్యూటీ విధించడం వల్ల డొమెస్టిక్ స్టీల్ ప్రొడ్యూసర్లకు రక్షణ లభించింది. దీంతో Tata Steel, JSW Steel షేర్లు పెరిగాయి. మెటల్ సెక్టార్ మొత్తం టాప్ గెయినర్గా నిలిచింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande