
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గ్నుడ్న్యూస్ చెప్పింది. గ్రాట్యుటీ, జీపీఎఫ్ (GPF), సరెండర్ లీవ్ ఎన్క్యాష్మాంట్తో పాటు వివిధ బకాయిల చెల్లింపుకు సుమారు రూ.713 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా రూ.700 కోట్లకు పైగా నిధులను దశలవారీగా విడుదల చేస్తోంది. అక్టోబర్ నెలలో రూ.712 కోట్లు, నవంబర్ నెలలో రూ.707.30 కోట్లు విడుదల అనంతరం ప్రస్తుతం రూ.713 కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు