వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
వనపర్తి, 31 డిసెంబర్ (హి.స.) వనపర్తి జిల్లా వీపన గండ్ల లోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ కొందరు రైతుల నుంచి వరి కొనుగోలు చేసి
అడిషనల్ కలెక్టర్


వనపర్తి, 31 డిసెంబర్ (హి.స.) వనపర్తి జిల్లా వీపన గండ్ల లోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ కొందరు రైతుల నుంచి వరి కొనుగోలు చేసి, మిల్లుకు తరలించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంబంధిత రైతుల ఖాతాల్లో సుమారు రూ.15 లక్షలు జమ కావడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల పై డాటా ఎంట్రీ ఆపరేటర్ జగదీష్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర నిర్వాహకులైన మహిళా సంఘాల సభ్యులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande