మరో మైలురాయికి చేరుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కీలక మైలురాయిని చేరుకుంది. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ,
యంగ్ ఇండియా స్కిల్స్


హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కీలక మైలురాయిని చేరుకుంది. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ, 2025 డిసెంబర్ నాటికి 1000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందించింది. నైపుణ్య విద్యా రంగంలో ఇంత తక్కువ టైమ్లో ఈ స్థాయి లక్ష్యాన్ని అందుకోవటం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పడింది. 2024 ఆగస్టు 1న యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. Public-Private Partnership విధానాల్లో దీన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరిస్తుండగా, పరిశ్రమల రంగానికి చెందిన ప్రముఖులతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీని పర్యవేక్షిస్తోంది. ఆనంద్మహీంద్రా బోర్డు చైర్మన్గా ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande