పాకిస్థాన్‌తో కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు: భారత్‌
ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) ఈ సంవత్సరం భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సడలింపునకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది (India rejects Chinas mediation c
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు: భారత్‌


ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.)

ఈ సంవత్సరం భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సడలింపునకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది (India rejects Chinas mediation claim). పాక్‌తో కాల్పుల విరమణ విషయంలో ఎవరి జోక్యం లేదని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల సైనిక డీజీఎంవోలు చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, ఇందులో మూడో పక్షం పాత్ర లేదని పునరుద్ఘాటించింది. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై ఇప్పటికే పలు సందర్భాల్లో తమ వైఖరిని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

ఈ ఏడాది భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సడలింపునకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ (China Wang Yi) మంగళవారం ప్రకటించారు. ఉత్తర మయన్మార్‌ సంక్షోభం, ఇరాన్‌ అణు సమస్య, ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఉద్రిక్తతల పరిష్కారానికీ తాము మధ్యవర్తిత్వం వహించామని చెప్పారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌, పాక్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ అంగీకారం కుదిర్చారంటూ భారతీయ మూలాలున్న ట్రంప్‌ సహాయకుడు రికీ గిల్‌ను అమెరికా ప్రభుత్వం తాజాగా సత్కరించి, అవార్డు ప్రదానం చేయడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande