ప్రేమ వివాహం స్టాక్‌ మార్కెట్‌లాంటిది
చెన్నై/ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) ‘ప్రేమ వివాహం స్టాక్‌ మార్కెట్‌ లాంటిది, అందులో హెచ్చు తగ్గులుంటాయి’ అని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ కుమార్తె కనిపించడం లేదంటూ తిరుచ్చికి చెందిన వ్యక్తి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కోర్టు
ప్రేమ వివాహం స్టాక్‌ మార్కెట్‌లాంటిది


చెన్నై/ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.)

‘ప్రేమ వివాహం స్టాక్‌ మార్కెట్‌ లాంటిది, అందులో హెచ్చు తగ్గులుంటాయి’ అని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ కుమార్తె కనిపించడం లేదంటూ తిరుచ్చికి చెందిన వ్యక్తి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఆ యువతి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరైంది. తాను పశ్చిమబెంగాల్‌ యువకుడిని వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నానని, తనను ఎవ్వరూ కిడ్నాప్‌ చేయలేదని తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు వారిని చదివిస్తారు. ప్రేమ వివాహం స్టాక్‌ మార్కెట్‌ లాంటిది. అందులో ఎత్తుపల్లాలుంటాయి. పిటిషనర్‌ కుమార్తె ఎవరితో వెళ్లాలనేది ఆమె వ్యక్తిగతం. అదే సమయంలో, తల్లిదండ్రుల భావాలను గౌరవించాల్సిన బాధ్యత పిల్లలపైనా ఉంది’’ అని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande