'అఖండ-2' మూవీ విడుదలను ఆపండి.. మద్రాసు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.) యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ''అఖండ-2'' విడుదలపై మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. రేపు (డిసెంబర్ 5, 2025) ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కావాల్సి
అఖండ టు


హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.) యువరత్న నందమూరి బాలకృష్ణ

హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం 'అఖండ-2' విడుదలపై మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. రేపు (డిసెంబర్ 5, 2025) ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా, కోర్టు స్టే విధించడంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మూవీ విడుదలకు బ్రేక్ పడటానికి ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పీ మధ్య జరుగుతున్న ఆర్థిక వివాదమే ప్రధాన కారణం.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande