
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
యెమెన్లో భారతీయ నౌకా సిబ్బంది అనిల్కుమార్ రవీంద్రన్ విడుదలయ్యారు. యెమెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎంవీ ఎటర్నిటీ సీ నౌకలో పనిచేస్తున్న రవీంద్రన్, జులై 07 నుండి యెమెన్ నిర్బంధంలో ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించిన వివరాల ప్రకారం.. అనిల్ కుమార్ రవీంద్రన్ నిన్న మస్కట్ చేరుకున్నారు. త్వరలోనే ఆయన తిరిగి భారతదేశానికి పయనం కానున్నట్లు ప్రకటించారు. ఆయన సురక్షితమైన విడుదల, తిరిగి రాకను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం వివిధ పక్షాలతో సమన్వయం చేసుకుంటూ కృషి చేసింది. అనిల్కుమార్ నిర్బంధంలో ఉన్న రవీంద్రన్ విడుదలకు సహకరించినందుకు ఓమన్ సుల్తానేట్కు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..