
అమరావతి, 5 డిసెంబర్ (హి.స.)నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వారికి ఊరటనిచ్చే వార్త అందింది. సినిమా విడుదలకు అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమైనట్టు తెలుస్తోంది.
ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా నిలిచిపోయిందని ప్రచారం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా విడుదలకు సంబంధించిన చెల్లింపులన్నీ నిర్మాతలు పూర్తిచేశారు. కేవలం ఒక క్లియరెన్స్ లెటర్ మాత్రమే రావాల్సి ఉందని, అది రాగానే సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ పరిణామంతో తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV