హమాస్ ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించాలని ఇజ్రాయెల్ వినతి
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్‌ ఇటీవల భారత్‌ను అధికారికంగా కోరింది. హమాస్‌- లష్కరే తోయిబా (LeT) మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చినంద
హమాస్ ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించాలని ఇజ్రాయెల్ వినతి


ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.)

హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్‌ ఇటీవల భారత్‌ను అధికారికంగా కోరింది. హమాస్‌- లష్కరే తోయిబా (LeT) మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చినందున, భారత్‌ కూడా ఇదే విధంగా స్పందించి హమాస్ ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని పేర్కొనింది. న్యూఢిల్లీ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

అయితే, హమాస్‌- లష్కరే తోయిబా వంటి గ్రూపుల వ్యవస్థలు, నెట్‌వర్క్‌లు, వాటి అనుసంధానాలపై భారత ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కలిగి ఉందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ సంస్థలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొనింది. అలాగే, ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (IRGC), హమాస్‌, హిజ్బుల్లా వంటి సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయడానికి అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయని టెల్ అవివ్ ఆరోపించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande