ఇండిగో షేర్లు ఢమాల్..
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజైన సోమవారం కూడా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా దేశ వ్యాప్తంగా 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులకు అవ
ఇండిగో


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజైన సోమవారం కూడా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా దేశ వ్యాప్తంగా 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఇక ఈ సంక్షోభం వేళ ఇండిగో షేర్లు భారీగా పడిపోయాయి.

ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్ ధర నేడు పడిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం పతనమైంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకొంది. ఉదయం 10 గంటల సమయంలో షేర్లు రూ.5,160 వద్ద, 3.92 శాతం (రూ.210.50) నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ల విలువ 9 శాతానికి పైగా విలువ కోల్పోయిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande