థాయ్లాండ్-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు..
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) థాయిలాండ్ - కంబోడియా సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్లో థాయ్ దళాలపై కంబోడియా దళాలు కాల్పులు జరిపారు. దీంతో థాయ్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్య
థాయిలాండ్


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) థాయిలాండ్ - కంబోడియా

సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్లో థాయ్ దళాలపై కంబోడియా దళాలు కాల్పులు జరిపారు. దీంతో థాయ్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఓ థాయ్ సైనికుడు మృతి చెందినట్లు థాయ్ సైన్యం వెల్లడించింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇరుపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande