ఆధార్‌ ధ్రువీకరణ కావాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) వ్యక్తిగత ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ ప్రతులను ఇక నుంచీ హోటళ్లు, ఈవెంట్‌ సంస్థల వంటివి ఎడాపెడా తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే ఆయా సంస్థలు.. ఉడాయ్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇక నుంచీ ఆ
ఆధార్‌ ధ్రువీకరణ కావాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి


ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) వ్యక్తిగత ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ ప్రతులను ఇక నుంచీ హోటళ్లు, ఈవెంట్‌ సంస్థల వంటివి ఎడాపెడా తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే ఆయా సంస్థలు.. ఉడాయ్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇక నుంచీ ఆధార్‌ ధ్రువీకరణకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నామని, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడంద్వారాగానీ, కొత్త ఆధార్‌ యాప్‌లోగానీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని, జిరాక్స్‌ పత్రాలను అడగకూడదని ఉడాయ్‌ సీఈవో భువనేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. జిరాక్స్‌ పత్రాలే కావాలనుకున్న సంస్థలు రిజిస్టరు చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఈ కొత్త నిబంధనను ఆధార్‌ అథారిటీ ఆమోదించిందని, త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande