
ముంబై, 08 డిసెంబర్ (హి.స.)బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 పెరిగి రూ.1,30,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 250 పెరిగి రూ.1,19,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.210 పెరిగి రూ.97,820 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇక వెండి ధర మాత్రం ఉశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,89, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,98,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,89, 000 దగ్గర అమ్ముడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ