
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.)
‘ఇండిగో’ సంక్షోభం నేపథ్యంలో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన టికెట్ రేట్ల పరిమితిని ఎయిర్ ఇండియా నేటినుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇది ఎకానమీ క్లాస్ టికెట్లకు వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా నేడు పోస్టు చేసింది.
‘‘డిసెంబర్ 6వ తేదీన పౌర విమానయాన మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అమలుచేసే క్రమంలో ఎకానమీ క్లాస్ టికెట్ల బేస్ ధరల పరిమితిని అమలుచేస్తున్నాం. మా రిజర్వేషన్ వ్యవస్థలో కొత్త ధరలు అమల్లోకి తీసుకొచ్చాం. ధర పరిమితి అమలును ఎయిర్ ఇండియా కొనసాగిస్తుంది. వచ్చే మరికొన్ని గంటల్లో ఇది పూర్తిగా ప్రభావం చూపిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ