
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.)
ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్‌మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా… సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండిగో సంక్షోభాన్ని అత్యవసరంగా విచారించలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది తీవ్రమైన సమస్యేనని.. లక్షలాది మంది బాధితులు ఉన్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ శనివారం పిటిషన్ దాఖలైంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని.. చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని కోరారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని… తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. తాజాగా అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ