
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.)
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్‌లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు. ఈ లొంగుబాటుతో ఎంఎంసీ జోన్ ఇప్పుడు దాదాపు నక్సలైట్ రహితంగా మారిందని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులలో కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ, చందు ఉసెండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేష్ పొట్టం,లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత తదితరులు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ లోని ఖైరాగఢ్ (కెసిజి) జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ప్రచారం మరో పెద్ద విజయాన్ని అందుకుంది. బకర్‌కట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంహి గ్రామంలో 12 మంది సిపిఐ (మావోయిస్ట్) కార్యకర్తలు మొత్తం 10 ఆయుధాలతో లొంగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ