రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది షెడ్యూల్ ఖరారు
ఢిల్లీ, 8 డిసెంబర్ (హి.స.) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెలలో శీతాకాల విడిది (winter resort)లో భాగంగా హైదరాబాద్ లో బస చేస్తారు. ఈ మేరకు ఈ సంవత్సరం కూడా ఆ షెడ్యూల్ ను కొనసా
president-draupadi-murmus-visit-to-tirupati-495838


ఢిల్లీ, 8 డిసెంబర్ (హి.స.)

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెలలో శీతాకాల విడిది (winter resort)లో భాగంగా హైదరాబాద్ లో బస చేస్తారు. ఈ మేరకు ఈ సంవత్సరం కూడా ఆ షెడ్యూల్ ను కొనసాగిస్తున్నారు. ఇందుకు కంటోన్మెంట్ లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని (President's Residence in Bollaram) అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. రాష్ట్రపతి భవన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం ఐదు రోజుల పాటు ప్రెసిడెంట్ హైదరాబాద్ లో ఉండనున్నట్లు షెడ్యూల్ (schedule) విడుదల చేశారు. ఈ ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇందులో భాగంగా, డిసెంబర్ 19న ఆమె రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత, డిసెంబర్ 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. ఆమె పర్యటనలో చివరి రోజులకు సంబంధించిన వివరాలు కూడా ఖరారయ్యాయి. డిసెంబర్ 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఈ సమావేశం అనంతరం నిర్వహించే తేనీటి విందులో ఆమె పాల్గొంటారు. చివరగా, డిసెంబర్ 22న ఉదయం ఆమె హైదరాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande