విపక్ష సభ్యుల నిరసనలతో అట్టుడికిన సెర్బియా పార్లమెంట్
సెర్బియా, 5 మార్చి (హి.స.) సెర్బియా పార్లమెంట్ లో విపక్ష సభ్యుల నిరసనలతో సెర్బియా పార్లమెంటు అట్టుడికింది. సభ్యులు రెచ్చిపోయారు. స్మోక్ బాంబులు, మండే స్వభావం కలిగిన ఇతర వస్తువులు విసురుకున్నారు. దాంతో సెర్బియా పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. కోడిగ
సెర్బియా పార్లమెంట్


సెర్బియా, 5 మార్చి (హి.స.)

సెర్బియా పార్లమెంట్ లో విపక్ష సభ్యుల నిరసనలతో సెర్బియా పార్లమెంటు అట్టుడికింది. సభ్యులు రెచ్చిపోయారు. స్మోక్ బాంబులు, మండే స్వభావం కలిగిన ఇతర వస్తువులు విసురుకున్నారు. దాంతో సెర్బియా పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. కోడిగుడ్లు, వాటర్ బాటిల్స్ కూడా విసురుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ఎంపీలకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యూనివర్సిటీ విద్యకు ఫండ్స్ పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అధికార పార్టీ అనేక నిర్ణయాలను ఆమోదించే యోచనలో ఉందని ఆరోపిస్తూ విపక్షాలు నిరసనకు దిగాయి. ఇది చట్ట విరుద్ధం అని నినాదాలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande