మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనమైంది. పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి.
తెలంగాణ/ఏ.పీ, 26 ఫిబ్రవరి (హి.స.) ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంది. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతుల్లో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్థాన్పై విమ
పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి.


తెలంగాణ/ఏ.పీ, 26 ఫిబ్రవరి (హి.స.)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంది. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతుల్లో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్థాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఫైర్ అయ్యారు. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనమైందని మండిపడ్డారు. ఇమ్రాన్ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితి కారణం అని పేర్కొన్నారు.

'పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై దేశంలోని అభిమానుల ఆగ్రహం సరైందే. పరిస్థితికి కారణం. దేశవాళీ క్రికెట్ను పూర్తిగా మార్చేశారు. దశాబ్దాలుగా అత్యుత్తమ క్రికెటర్లను అందిస్తోన్న దేశవాళీ క్రికెట్ను నిర్లక్ష్యం చేశారు. పాకిస్థాన్కు సరిపోని ఆస్ట్రేలియన్ హైబ్రిడ్ మోడల్తో పతనం ప్రారంభమైంది' అని నజామ్ సేథి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande