
అమరావతి, 24 మే (హి.స.)
పల్నాడు జిల్లా: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో ఇవాళ(శనివారం) డబుల్ మర్డర్ జరిగింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కిందపడిన ఇద్దరిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. గత జగన్ ప్రభుత్వంలో తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నరికి చంపిన విషయం తెలిసిందే.
తాజాగా అదే గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ వర్గీయులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాల్లో సంచలనంగా మారింది. ఈ విషయం తెలియడంతో జిల్లా ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం జిల్లా నేతలు టీడీపీ హై కమాండ్‌కు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ