ఈతకొడుతూ ఆనందంగా గడుపుదామన్న బాలికల మృత్యువుకు.సరదా మృత్యువుకు.దారి తీసింది
అమరావతి, 24 మే (హి.స.) గోనెగండ్ల, : ఈత కొడుతూ ఆనందంగా గడుపుదామనుకున్న బాలికల సరదా మృత్యువుకు దారితీసింది. గోనెగండ్లలో మండలం కురువపేటకు చెందిన మంజుల(13), మధుప్రియ (14)లు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వేసవి సెలవులు కావడంతో తల్లుల వెంట కూలీ పనులకు వె
ఈతకొడుతూ ఆనందంగా గడుపుదామన్న బాలికల మృత్యువుకు.సరదా మృత్యువుకు.దారి తీసింది


అమరావతి, 24 మే (హి.స.)

గోనెగండ్ల, : ఈత కొడుతూ ఆనందంగా గడుపుదామనుకున్న బాలికల సరదా మృత్యువుకు దారితీసింది. గోనెగండ్లలో మండలం కురువపేటకు చెందిన మంజుల(13), మధుప్రియ (14)లు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వేసవి సెలవులు కావడంతో తల్లుల వెంట కూలీ పనులకు వెళ్తున్నారు. నిత్యం సాయంత్రం తిరిగొచ్చే క్రమంలో మార్గమధ్యలో పంట కుంటలో ఈత నేర్చుకొంటున్నారు. శుక్రవారం పనులు ముగించుకొని ఇంటికొస్తూ ఈతకెళ్లారు. రెండు రోజుల కిందట కురిసిన వర్షాలకు అందులో భారీగా నీళ్లు చేరాయి. వారికి సరిగా ఈత రాదు.. నీటి నిల్వ పెరగడంతో అందులో మునిగిపోయారు. బాలికలు ఎంతసేపటికీ రాకపోవడంతో వెంటనే మంజుల తల్లి కుంట దగ్గరకు వెళ్లారు..ఆ లోపే ఇద్దరు బాలికలు నీటిలో తేలియాడుతూ కనిపించారు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోని రైతులు ఘటన స్థలానికి చేరుకుని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం గోనెగండ్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. మధుప్రియ ఏడో తరగతి చదువుతుండగా మంజుల పాఠశాలకు వెళ్లడం లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande