పుతిన్కు ఏమైంది?.. పిచ్చి పట్టిందా?: డోనాల్డ్ ట్రంప్
న్యూయార్క్,26 మే (హి.స.)అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఉక్రెయిన్ పై భీకర స్థాయిలో రష్యా తన డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో మీడియాతో ట్రంప్ స్పందిస్తూ... ప
డోనాల్డ్ ట్రంప్


న్యూయార్క్,26 మే (హి.స.)అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఉక్రెయిన్ పై భీకర స్థాయిలో రష్యా తన డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో మీడియాతో ట్రంప్ స్పందిస్తూ... పుతిన్ అనుసరిస్తున్న విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. అతనికి ఏమైంది? అనేక మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాడు.. పుతిన్కు పిచ్చి పట్టిందా అని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఏ కారణం లేకుండానే రష్యా దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు.

న్యూజెర్సీలో రిపోర్టర్లతో మాట్లాడుతూ.. చాన్నాళ్ల నుంచి పుతిన్ తెలుసు అని, నగరాలు, ప్రజలపై రాకెట్లను వదులుతున్నాడని, దీన్ని ఇష్టపడడం లేదని ట్రంప్ తెలిపారు. పుతిన్ క్రేజీగా మారినట్లు అతడు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande