భారీ వర్షాలకు మహారాష్ట్ర విలవిల.. నదులను తలపిస్తున్న రోడ్లు..
పూణే, 26 మే (హి.స.) నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కేరళ తర్వాత, నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి. ఆదివారం మహారాష్
మహారాష్ట్రలో వర్షాలు


పూణే, 26 మే (హి.స.)

నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కేరళ తర్వాత, నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి.

ఆదివారం మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా, పూణే-సోలాపూర్ హైవే జలమయం అయింది. రోడ్లు నదులను తలపించాయి. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలు ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

రాబోయే మూడు రోజుల్లో ముంబై, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు వ్యాపిస్తాయని IMD తెలిపింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande