బెంగళూరు ఫామ్ హౌస్ రేవ్ పార్టీపై పోలీసుల దాడి. 31 మంది అరెస్ట్..
బెంగళూరు, 26 మే (హి.స.) ఓ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. 31 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి, కన్నమంగళ గేట్ వద్ద ఒక ఫామ్ హౌస్ లో చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో
బెంగళూరు ఫామ్ హౌస్


బెంగళూరు, 26 మే (హి.స.)

ఓ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. 31 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి, కన్నమంగళ గేట్ వద్ద ఒక ఫామ్ హౌస్ లో చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 24 మంది పురుషులు, 7 మంది మహిళలు ఉన్నారు. వీరంతా ఎక్కువ ఐటీ రంగంలో పనిచేసే వ్యక్తులని పోలీసులు గుర్తించారు. అనంతరం పట్టుబడ్డ వారి నుంచి కొకైన్, హషీష్, హైడ్రో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఆ రేవ్ పార్టీలో అరెస్ట్ చేయబడిన వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే మాదకద్రవ్యాల సరఫరా ముఠాను గుర్తించడానికి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande