
గుజరాత్, 26 మే (హి.స.) గుజరాత్లోని దాహోద్లో
లొకేమోటివ్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశీయ ప్రయోజనాలకు అవసరమైన 9000 హెచ్పీ ఎలక్ట్రిక్ ఇంజిన్లను ఆ ప్లాంట్లో తయారు చేస్తారు. రైల్వే శాఖ సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్లాంట్ సహకరించనున్నది. దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కేంద్రం ఇదే కానున్నది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న లోకేమోటివ్ను ఎగుమతి కూడా చేయనున్నారు. దాహోద్ లోకోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ వర్క్షాపుకు రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. చాలా తక్కువ సమయంలో ఉత్పత్తి మొదలైనట్లు పశ్చిమ రైల్వే సీపీఆర్వో వినీత్ అభిషేక్ తెలిపారు. ప్రతి ఏడాది 120 లొకోమోటివ్లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. భవిష్యత్తులో ఆ సంఖ్యను 150కు పెంచే అవకాశాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..