
ముంబై, 27 మే (హి.స.)
ఆర్థిక రాజధాని ముంబైలోని ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబై ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామంటూ అగంతకులు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముంబై విమానాశ్రయాన్ని పేల్చివేస్తాము అని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మూడు గంటల పాటు ఎయిర్పోర్ట్ను తనిఖీ చేశారు. బాంబు గుర్తింపు బృందాలు, ఇతర భద్రతా సంస్థలు విమానాశ్రయంలో హై అలర్ట్లో ఉన్నాయి.
బెదిరింపు కాల్ చేసిన 35 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని యూపీ కి చెందిన మంజీత్ కుమార్ గౌతమ్ గా గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్