
తెలంగాణ, ఆదిలాబాద్ 28 మే (హి.స.)
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ఏ విధమైన ఆస్తి నష్టం కలగకుండా అధికారులు హెడ్ క్వార్టర్ లోనే ఉండి పర్యవేక్షించాలని తెలిపారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాల వలన వరదలు, వంకలు ఉప్పొంగిపోతే రోడ్లు, వంతెనలు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నాలాలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు