ప్రతిరోజూ పరగడుపున వేపాకులు తింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయ్..!
కర్నూలు, 28 మే (హి.స.) వేపాకు.. ఆయుర్వేదంలో ఇదో అద్భుత సంజీవని .. సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు. వేప ఆకు ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ, వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి హైపర్‌ గ్లైసెమిక్‌, యాంటి అల్సర్‌, యాంట
Do you know the benefits of peanuts in telugu lifestyle news


కర్నూలు, 28 మే (హి.స.)

వేపాకు.. ఆయుర్వేదంలో ఇదో అద్భుత సంజీవని .. సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు. వేప ఆకు ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ, వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి హైపర్‌ గ్లైసెమిక్‌, యాంటి అల్సర్‌, యాంటి మలేరియల్‌, యాంటి ఫంగల్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి వైరల్‌, యాంటి ఆక్సిడెంట్‌, యాంటి మ్యుటాజెనిక్‌, యాంటి కార్సినోజెనిక్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేపలో విటమిన్‌-ఎ, సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని గుణాలు కలిగిన వేపాకులు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో వేపాకులు తింటే ఏమవుతుందో తెలుసా.? పూర్తి వివరాల్లోకి వెళితే..

పరగడుపున వేపాకులు తినడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. ఆర్ధరైటిస్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు వేపాకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వేపాకులు నమిలి తినడం వల్ల శరీరం మెటబోలిజం మెరుగుపడుతుంది. ఆకలి క్రమబద్ధీకరణ అవుతుంది. బరువు నియంత్రణకు దోహదపడుతుంది.

వేప ఆకుల సారాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో రకాల అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. వేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు కూడా ఎక్కువ. వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఈ వేపాకుల రసం శరీరానికి అందిస్తుంది.

డయాబెటిస్ రోగులకు వేపాకులు చాలా మంచివి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వేపాకులు తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యలు క్రమంగా దూరమవుతాయి. రోజూ పరగడుపున వేపాకులు తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సంక్రమణ వ్యాధుల ముప్పు తొలగిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande