2025లో హజ్ యాత్ర,, జూన్ 4 నుండి జూన్ 9 మధ్యలో జరగనుందని
హైదరాబాద్, 28 మే (హి.స.)హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ (పవిత్ర మసీదు) ప్రాంతంలో జరగుతుంది. హజ్ యాత్ర ఇస్లాం మతంలోని కీలక అంశం. అంటే ఒక ముస్లిం ఆర్థికంగా, శారీరక
2025లో హజ్ యాత్ర,, జూన్ 4 నుండి జూన్ 9 మధ్యలో జరగనుందని


హైదరాబాద్, 28 మే (హి.స.)హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ (పవిత్ర మసీదు) ప్రాంతంలో జరగుతుంది. హజ్ యాత్ర ఇస్లాం మతంలోని కీలక అంశం. అంటే ఒక ముస్లిం ఆర్థికంగా, శారీరకంగా స్తోమత ఉన్నంతలో తన జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర చేయాలి. ఇక హజ్ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12వ నెల ధుల్ హిజ్జా లో నిర్వహించబడుతుంది. ధుల్ హిజ్జా 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ పవిత్ర యాత్రలో లక్షలాది ముస్లింలు పాల్గొంటారు. హజ్ లో భాగంగా ముస్లింలు ‘కాబా’ చుట్టూ తవాఫ్ చేయడం, సఫా-మర్వా కొండల మధ్య నడవడం, మినా, అరాఫాత్, ముజ్దలిఫాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం వంటి ఆత్యాద్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

2025లో హజ్ యాత్ర, చంద్రుని దర్శనాన్ని ఆధారంగా చేసుకుని, జూన్ 4 నుండి జూన్ 9 మధ్యలో జరగనుందని అంచనా. కాగా, హజ్ తేది ఖచ్చితంగా చంద్రుని తొలినాటి దర్శనంపై ఆధారపడి నిర్ణయించబడుతుంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande