
హైదరాబాద్, 28 మే (హి.స.)
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజీయం సిఫార్సు చేసింది. ప్రస్తుతం త్రిపుర చీఫ్ జస్టిస్గా జస్టిస్ అపరేష్ ఉన్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజీయం ఓకే చెప్పింది. ఆయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ రామచందర్ రావు హైదరాబాద్ వాసి. జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రాంచందర్ రావు విధులు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్