1,700కు పైగా గర్భస్రావ కిట్లు స్వాధీనం.. ఎఫ్ఐఆర్‌ నమోదు..
దిల్లీ: , 28 మే (హి.స.)హర్యానా రాష్ట్రంలో అక్రమంగా అమ్ముడవుతున్న మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MPT) కిట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతవారం జరిగిన ఈ తనిఖీలలో మొత్తం 1,787 ఎంపీటీ కిట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆరు ఎ
1,700కు పైగా గర్భస్రావ కిట్లు స్వాధీనం.. ఎఫ్ఐఆర్‌ నమోదు..


దిల్లీ: , 28 మే (హి.స.)హర్యానా రాష్ట్రంలో అక్రమంగా అమ్ముడవుతున్న మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MPT) కిట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతవారం జరిగిన ఈ తనిఖీలలో మొత్తం 1,787 ఎంపీటీ కిట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు అధికారులు. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్ రాజపాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర లింగ నిష్పత్తి అభివృద్ధి బృందం వారపు సమావేశంలో వెల్లడించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ గర్భస్రావాలపై గట్టి చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వైద్యులపై లైసెన్స్ రద్దు వరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మే 20 నుంచి 26 వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో 1,787 ఎంపీటీ కిట్లు స్వాధీనం కాగా, మూడు షాపులు మూసివేయబడ్డాయని ఆయన తెలిపారు. అలాగే, ఒక నెల వ్యవధిలో ఎంపీటీ కిట్లు విక్రయిస్తున్న హోల్‌సేల్ డీలర్ల సంఖ్య 32 నుంచి 6కి తగ్గించామని వారు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande